మీలాద్ ఆధ్యాత్మిక సదస్సులను..విజయవంతం చేయండి…

0 9,691

-మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్  ముచ్చట్లు:

 

- Advertisement -

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మహనీయ  మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున 11 రోజులు..11 ప్రాంతాల్లోని మస్జిద్ లలో, ఒక చౌరస్తాలో, ఒక ఫంక్షన్ హాల్ లో ఆధ్యాత్మిక సదస్సులు, కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని కరీంనగర్ మర్కజీ మీలాద్ కమీటీ అధ్యక్షుడు ముఫ్తి అలీమోద్దీన్ నిజామీ..కమిటీ బాధ్యులు మంగళవారం వెల్లడించారు. నగరంలోని హుస్సేనీ పురలో ఖాళీదే గుల్షన్ బొంబాయి స్కూల్ లో ఆధ్యాత్మిక కార్యక్రమాల పోస్టర్ అవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా  నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీలాద్ కమిటీ బాధ్యులు మాట్లాడుతూ మహానియ మహమ్మద్ ప్రవక్త పుట్టిన నెల రబీవుల్ అవ్వల్ 12వ తేదీన ప్రతిసారిలాగే ఈ ఏడాది కూడా బొంబాయి స్కూల్ నుండి పవిత్ర పాదయాత్ర ఉంటుందని,  ఆధ్యాత్మిక ప్రవచనాలు చదువుకుంటూ ర్యాలీగా ఖార్ఖాన గడ్డ మహమ్మది మజీద్, నాకా చౌరస్తా మీదుగా సివిల్ హాస్పిటల్, సవారన్ మజీద్, రాజీవ్ చౌక్, కరీముల్లాహ్ షా దర్గా వద్ద ముగింపు ఉంటుందన్నారు. 11 రోజుల పాటు 11 ప్రాంతాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు (జల్సా)లకు పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చి ఆయా ప్రాంతాల్లో విజయవంతం చేయాలని, బొంబాయి స్కూల్ నుండి వెళ్లే ర్యాలీకి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మర్కజీ మిలాద్ కమిటీ ఉపాధ్యక్షుడు బొంబాయి బాబా ఫరీద్, ప్రధాన కార్యదర్శి గులాంరబ్బానీ ఖాద్రి శంసి, సహాయ కార్యదర్శి గౌసోద్దీన్ ఖాద్రి, సమద్ నవాబ్, కోశాధికారి వలి పాషా, కార్యవర్గ సభ్యులు నఖీబ్ రజా, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రహమాన్, లాయీక్ ఖాద్రి, వార్డ్ మెంబర్ వాజిద్, హాజీ, రామంచ దర్గాహ్ ఖాదీమ్ కరీంఖాన్, యజ్దాని, హజీ, అంజద్ ఖాన్ ముజ్జు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; Make Milad Spiritual Conferences a Success …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page