ప్రకాశ్  భావోద్వేగం

0 7,566

హైదరాబాద్ ముచ్చట్లు:

మంచు విష్ణు ప్యానెల్‌పై ‘మా’ ఎన్నిక‌ల అధికారికి శ్రీకాంత్, జీవితా రాజ‌శేఖ‌ర్‌తో క‌లిసి ప్ర‌కాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. ‘మా’ ఎన్నిక‌ల నియమావ‌ళిని ఉల్లంఘిస్తున్నార‌ని పేర్కొంటూ ఎన్నిక‌ల స‌హాయ అధికారి నారాయ‌ణ‌రావుకు ప్ర‌కాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. పోస్ట‌ల్ బ్యాలెట్ల విష‌యంలో మంచు విష్ణు కుట్ర చేస్తున్నార‌ని తెలిపారు. 60 మందితో అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు కుట్ర చేస్తున్నార‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్‌రాజ్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోన‌య్యారు. ‘మా’ ఎన్నిక‌ల్లో పోస్ట‌ల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోంద‌న్నారు. ఏజెంట్ల ద్వారా పోస్ట‌ల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. 60 ఏండ్లు పైబ‌డిన న‌టీన‌టులు పోస్ట‌ల్ బ్యాలెట్‌కు అర్హులు. పోస్ట‌ల్ బ్యాలెట్ అర్హ‌త ఉన్న స‌భ్యుల నుంచి సంత‌కాలు సేక‌రించి, నిన్న ఒక వ్య‌క్తి 56 మందికి పోస్ట‌ల్ బ్యాలెట్ డ‌బ్బులు క‌ట్టారు. అయితే పోస్ట‌ల్ బ్యాలెట్ ఓటు వేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు లేఖ రాసి డ‌బ్బు క‌ట్టాలి. కానీ అది జ‌ర‌గ‌లేద‌న్నారు. కృష్ణ‌, కృష్ణంరాజు, శార‌ద‌, ప‌రుచూరి పోస్ట‌ల్ డ‌బ్బులు కూడా విష్ణు త‌ర‌పు వ్య‌క్తే క‌ట్టారు. దీనిపై కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున స‌మాధానం చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం కూడా వృథా అని ప్ర‌కాశ్‌రాజ్ భావోద్వేగానికి,,..

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Prakash emotion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page