తొలిసారిగా గంగమ్మకు ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పణ

0 9,291

– జీవోను జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
– మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చే పట్టువస్త్రాలు అందజేత
– రాష్ట్రంలో బోయకొండ ఆలయానికి గుర్తింపు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మ ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలిసారిగా పట్టు  వస్త్రాలు సమర్పించడానికి అనుమతిస్తూ దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్‌ జీవో జారీచేశారు. ఈ విషయాన్ని ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిలు విలేకరుల సమావేశంలో తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ల ఆధ్వర్యంలో ఆలయంలో కోట్లాదిరూపాయల నిధులు మంజూరు చేయించారన్నారు.ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ది పనులు వేగవంతంగా పూర్తి దశకు చేరువలో ఉన్నాయి. ఈక్రమంలో ఆలయంలో ఈనెల 7నుంచి 15వతేదీ వరకు నిర్వహించబోయే దసరా మహ్గత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వంనుంచి అమ్మవారికి పట్టువలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చే సమర్పించాలని జీవో జారీ చేయడం ,రాష్ట్రంలోనే బోయకొండకు గుర్తింపు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి కుటుభీకులను స్థానికులు, భక్తులు అభినందించారు.ఈ ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి అమ్మవారికి సాంప్రదాయరీతిలో పట్టువస్త్రాలు సమర్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Presentation of silks by the government to Gangam for the first time

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page