చార్ ధామ్‌కు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితి తొలగింపు

0 8,605

– ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు

ఉత్తరాఖండ్ ముచ్చట్లు:

- Advertisement -

చార్ ధామ్ సందర్శించే భక్తుల రోజువారీ పరిమితిని తొలగిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది. చార్ ధామ్‌కు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన కొన్ని రోజులకు..ఈ మేరకు హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. జస్టిస్ ఆర్‌సీ ఖుల్బే, జస్టిస్ అలోక్ కుమార్ డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం దాఖలు చేసిన సవరణ దరఖాస్తులో.. యాత్రాదారులపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని కోరింది. భక్తుల సంఖ్యపై పరిమితి ఉండటంలో చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుంటున్న వారి సంపాదనపై ప్రభావం చూపుతున్నదని తన పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొన్నది.చార్ ధామ్ యాత్రపై నిషేధాన్ని హైకోర్టు గత నెలలో ఎత్తివేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని విధించింది. కోర్టు ఆదేశాల మేరకు కేదార్‌నాథ్ ధామ్‌లో 800, బద్రీనాథ్ ధామ్‌లో 1200, గంగోత్రిలో 600, యమునోత్రిలో 400 మంది యాత్రికులను అనుమతించారు.కరోనా పాజిటివ్‌ పరీక్ష రిపోర్ట్‌, టీకా ధ్రువీకరణ పత్రాన్ని యాత్రికులు తప్పనిసరిగా సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మతో కూడిన కోర్టు డివిజన్ బెంచ్ కూడా ఆదేశించింది. దేవాలయాల చుట్టూ ఉన్న ఏ చెరువులోనూ భక్తులు స్నానం చేయడానికి అనుమతించకూడదని కూడా సూచించింది. ఈ ఏడాది జూన్‌లో చమోలి, రుద్రప్రయాగ్‌తోపాటు ఆలయాలు ఉన్న ఉత్తరకాశి జిల్లాల నివాసితుల కోసం పరిమిత మార్గంలో చార్ ధామ్ యాత్రను ప్రారంభించాలన్న రాష్ట్ర నిర్ణయానంపై హైకోర్టు స్టే విధించింది.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Removal of daily limit on the number of devotees coming to Char Dham

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page