రైతన్నల పై దమనకాండ సృష్టించిన  మంత్రిని బర్తరఫ్ చేయాలి

0 9,692

– సీపీఐ నాయకులు బాబా ఫకృద్దీన్. కె ప్రసాద్ డిమాండ్

నంద్యాల ముచ్చట్లు:

- Advertisement -

సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్లోని లెక్కిం పూర్ కిరి జిల్లాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతన్నపై ఉత్తర ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే నలుగురు రైతులు మరణించడం.అదే ఘటనలో కాల్పుల్లో మరో నలుగురు మరణించడాన్ని నిరసిస్తూ మంగళవారం నాడు నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పట్టణ కార్యదర్శి  కె ప్రసాద్ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు రైతు సంఘం కార్యదర్శి  జి సోమన్న ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి ఏ సురేష్ ఏఐఎస్ఎఫ్ నాయకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూరైతులు గత 11 నెలలుగా  మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని వివిధ రూపాలలో శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల ను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించక పోగా ఇలా దమనకాండ సృష్టించడం వలన దేశానికి  ఏ మెసేజ్ ఇస్తున్నారని అన్నారు.

 

 

 

వెంటనే ఉత్తర ప్రదేశ్ లో రైతుల మరణాలకు కారణమైన యూపీ హోమ్ మినిస్టర్ ను పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆయన కొడుకు పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని  అదే విధంగా మరణించిన ఒక్కొక్క రైతు కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటియుసి నాయకులు అనంతయ్య. వెంకటేశ్వర్లు. అంజి. శివ శంకర్. వెంకటేశ్వర్ రెడ్డి. మల్లికార్జున. దస్తగిరి. సతీష్. రమణ. సుబ్బరాయుడు. గౌస్ నాగేష్. నాగరాజు. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: The minister who created the repression on the peasants should be sacked

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page