ఏ పోలీస్ స్టేషన్లో నైనా సైబర్ నేరాలపై బాధితులు ఫిర్యాదు చేయవచ్చు

0 9,664

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:

జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్ నైనా సైబర్ నేరాలపై బాధితులు ఫిర్యాదు చేయవచ్చునని  ఐటీ కోర్ ఎస్సై మారుతి అన్నారు. మంగళవారం  జిల్లా రాహుల్ హెగ్డే  ఐపీఎస్  ఆదేశాల మేరకు ఐ.టి కోర్ ఎస్.ఐ మారుతి  మరియు సిబ్బంది జిల్లా లోని సి.ఐ లకు,ఎస్..ఐ లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూజిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ కు సంబందించిన దరఖాస్తు స్వీకరించాలి అని మరియు  నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్ సి ఆర్ పి  ఆన్లైన్ లో మరియు టోల్ ఫ్రీ నంబర్155260  ద్వారా కూడా సైబర్ నేరాలపై బాధితులు పిర్యాదు చేయవచ్చు అని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు తెలిసేలా అవగాహన  కార్యక్రమాలు చేపట్టాలి అని అన్నారు..బాధితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే విధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలునిర్వహించాలన్నారు.మోసపూరిత లావాదేవీలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే వాటిని తక్షణం నిలిపి వేసిసంబంధిత వారి యొక్క ఖాతా ను సీజ్  చేసే విధంగా చూడవచ్చు అన్నారు.ఎన్ సి  ఆర్ పి  లో నివేదిక అయిన కేసు లు మరియు సైబర్ క్రైమ్ ల యెక్క ఎంవో   ముడ్స్   ఆపరేటి  గురించి సి.ఐ లకు ఎస్.ఐ లకు టెక్ టీం సిబ్బందికి వివరించడం జరిగింది…

 

- Advertisement -

మీరు సైబర్ క్రైమ్ బాధితులా? అయితే ఇలా చేయండి…

మోసపూరిత లావాదేవీలను తక్షణమే నిలిపివేయడం కోసం,   155260 టోల్ ఫ్రీ నంబర్/ డయిల్  100 కు కాల్ చెయ్యండి.పోయిన వెంటనే 24 గం ల లోపు పిర్యాదు చేస్తే,  సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతా లు పోలీసు అధికారులు నిలిపివేస్తారు. కొట్టేసిన నగదును బాధితుడి ఖాతా లో జమ చేసేలా చూస్తారు..
ఆ తరువాత ఎన్ సిఆర్ పి పోర్టల్(www.cybercrime.gov.in) లో పిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు.

 

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Victims can lodge a complaint of cyber crime at any police station

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page