మారిపోతున్న కండువాలు

0 7,583

కరీంనగర్ ముచ్చట్లు:

 

ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో హుజూరాబాద్‌ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు నేతలు. అధికార టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న ఇరుపార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఒకరిని మించి మరొకరు.. ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. పార్టీ ఫిరాయింపులు, చేరికలు.. రాజీనామాలతో రాజకీయం రసకందాయంలో పడింది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.అధికార టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు భారీ షాకిచ్చింది. హుజూరాబాద్‌కి చెందిన బీజేపీ కౌన్సలిర్ ఉమా మహేశ్వర రావు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో కమలం పార్టీని వదిలి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలతో కలసి పార్టీలో చేరారు. మంత్రి గంగుల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామంతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటలకి షాకిచ్చినంత పనైంది.అయితే ఆయన కూడా అదే రేంజ్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను బీజేపీలోకి తీసుకొచ్చి బదులు తీర్చుకున్నారు. జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సురేందర్ రాజు, పలువురు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, మహిళలను బీజేపీలోకి చేర్చుకున్నారు. వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పోటాపోటీగా తలపడుతున్న బీజేపీ, టీఆర్‌ఎస్ చోటా నేతలను వదలకుండా పట్టుకునేందుకు గాలమేసే పనిలో పడ్డాయి..

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Changing scarves

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page