పుంగనూరులో 10న వైఎస్‌ఆర్‌ ఆసరాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

0 9,376

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్‌ హరినారాయణ్‌ కలసి జిల్లా స్థాయి ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. బుధవారం రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపిపి భాస్కర్‌రెడ్డితో కలసి సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జరిగే ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గౌతమరెడ్డితో కలసి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపిలు, జిల్లా అధికారులు హాజరౌతున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆసరా లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలరీన్నారు. సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిఏ మునితుకారాం, డిఆర్‌డిఏ పీడీ తులసి, సీఐ గంగిరెడ్డి, పార్టీ నాయకులు అంజిబాబు, అమ్ము, కళ్యాణ్‌భరత్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Minister Peddireddy will launch the YSR support in Punganur on the 10th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page