నీలకంఠాపురం లో శ్రీరామిరెడ్డి 115 వ జయంతి ఉత్సవాలు

0 7,559

అనంతపురం  ముచ్చట్లు:

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ శ్రీరామిరెడ్డి జయంతి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నవీన్ ముఖ్య అతిథిగ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్యశిబిరాన్ని జాయింట్ కలెక్టర్ నవీన్ తో కలసి  రఘువీరారెడ్డి ప్రారంభించారు .బెంగుళూరు పీపుల్ ట్రీ హాస్పిటల్ ప్రఖ్యాత వైధ్యులు వైధ్యశిబిరంలో పాల్గొన్నారు.మారుమూల ప్రాంతమైన నీలకంఠాపురంలో గుండె వైద్య నిపుణులు రావడంతో చాలామంది గుండె వ్యాధిగ్రస్తులు పరీక్షలు చేయించుకొన్నారు.అనంతరం జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో జన్మించిన శ్రీరామిరెడ్డి మహోన్నత స్ధాయికి ఎదగడం,ప్రధాన మంత్రికి సలహాలు ఇచ్చేస్థాయిలో ఉండడం ఎంతో గొప్పవిషయమన్నారు.విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలన్నారు.జాయింట్ కలెక్టర్ ప్రసంగిస్తుండగ వర్షం రావడంతో సభలో కూర్చొన్న వారంత చెట్లచాటుకు వెళ్లారు కాని రఘువీరా ఆయన ప్రసంగాన్ని వర్షంలో తడుస్తూనే అలాగే కూర్చిండిపోయి ముఖ్యఅతిథి మాటలువింటూ  గౌరవమిచ్చారు .ఈకార్యక్రమంలో ,విధ్యార్థులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Sri Ramireddy 115th birth anniversary celebrations in Neelkanthapuram

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page