కుప్పంలో ప్రయివేట్ ఆస్పత్రి నిర్లక్షానికి నిండుప్రాణం బలి.

0 8,775

కుప్పం  ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా కుప్పం పైభాట కి చెందిన వెంకటరమణ భార్య గంగ కి బుధవారం  సాయంత్రం కడుపు నొప్పిఎక్కువగా ఉండటంతో కుప్పం కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తువచ్చిన డాక్టర్లు పరిస్థితి చేయిదాటిపోయిన తరువాత వేరే ఆసుపత్రికి తీసుకెళ్ళందని  సలహా ఇచ్చారు. వారు ఆమెను హుటాహుటిన పీఈఎస్ కు  తరలించేందుకు ప్రయత్నించగా అంబులెన్స్ లో పెట్రోల్ లేదని  సమాధానం ఇచ్చారు. అయితే ఎలాగోలా అంబులెన్స్ లో pes కి తరలించే లోపు మహిళ మరణించిందని 10 నిముషాలు ముందు తీసుకొని వచ్చి ఉంటే మహిళ ప్రాణాలు మిగిలేవని డాక్టర్లు చెప్పారని బాధితులు అంటున్నారు.. కాగా నిండు ప్రాణం పోవడానికి కుప్పం కేర్ ఆసుపత్రి యాజమాన్యమే కారణమని భాదితులు ఆరోపిస్తూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ఉదయం నుంచి ఆసుపత్రి ఎదుటే రోడ్డుకు అడ్డంగా శవాన్ని ఉంచి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుపోగా పోలీసుల సహాయంతో తమను బెదిరిస్తున్నారని వాపోయారు.  ఆసుపత్రి ఎదుట శవంతో ఉదయం నుండి రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని నిరసన చేస్తున్న భాదితులకు ఇప్పటివరకు ఆసుపత్రి యాజమాన్యం స్పందించలేదని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేవారకు శవాన్ని తీసేలేదని ఇక్కడినుంచి కదలమని బాధితులు భీష్మించుకుని కూర్చున్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:A private hospital in Kuppam sacrificed its life for negligence

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page