బద్వేలు ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్ధి నామినేషన్ దాఖలు.

0 7,577

కడప ముచ్చట్లు:

కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పనతల సురేష్ నామినేషన్ దాఖలు చేశారు.  బద్వేలు తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ కు మాజీ ఎమ్మెల్యే జయరాములు, పనతల సురేష్ కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బద్వేలు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని.  భారతీయ జనతా పార్టీ పలు సంక్షేమ పథకాలతో ముందుకు పోతుందని. వారసత్వ రాజకీయాలకు చోటివ్వకుండా బిజెపి పార్టీలో కష్టపడి పనిచేసిన యువకుడిగా గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించిందని. అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఈ ఈ ఉప ఎన్నికల్లో బద్వేల్ పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఓటు వేస్తే బీజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులతో బద్వేలు పట్టణం అభివృద్ధి చేస్తానని తెలియజేశారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Badvelu files BJP candidate nomination for by-elections

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page