మహిళల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి.

0 7,952

రామసముద్రం ముచ్చట్లు:

మహిళల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం స్థానిక సచివాలయంలో రెండవ విడత వైఎస్సార్ ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని అబద్ధపు మాటలు చెప్పి మభ్యపెట్టడం జరిగిందని అన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అక్కాచెల్లెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తూ రెండో విడతను విడుదల చేయడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం హయాంలో పొదుపు సంఘాలు నిర్వీర్యమైపోయాయన్నారు. రుణ మాఫీ చేస్తామని చెప్పి డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. సున్నా వడ్డీ పధకాన్ని కూడా రద్దు చేశారని, వైకాపా ప్రభుత్వమే తిరిగి ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మహిళలు రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులను సంక్షేమ పధకాల ద్వారా మార్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు. చేయూత కార్యక్రమం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని,  నాలుగేళ్ల పాటు ప్రతీ ఏడాది మహిళలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోందని తెలిపారు. పంచాయతీ పరిధిలో 30 సంఘాలకు గాను రెండు విడతలుగా సుమారు రూ.41లక్షలు లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పంచాయతీ ప్రజల తరపున సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషాలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ గంగాధర్,  సంఘమిత్రాలు మమత, సరిత, స్థానిక నాయకులు బాబు,  ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, నాగరాజ, వెంకటరమణ తదితర మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Government Mission for the Advancement of Women- Sarpanch Srinivasareddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page