టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

0 9,687

తిరుమల ముచ్చట్లు:

 

టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు   వై.వి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న గురువారం తిరుమల అన్నమయ్య భవనంలో నూత‌న బోర్డు తొలి స‌మావేశం జరిగింది. ధర్మకర్తల మండలి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదం. చెన్నై, బెంగళూరు, ముంబైలో టిటిడి సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం.

- Advertisement -

చెన్నై –   ఎ.జె.శేఖర్ రెడ్డి
బెంగళూరు-   రమేష్‌ శెట్టి
ముంబై –   అమోల్‌ కాలే

– అలిపిరి కాలిబాట సుందరీకరణ పనులకు రూ.7.50 కోట్లతో టెండర్లకు ఆమోదం. వైఎస్‌ఆర్‌ జిల్లా రాయచోటిలో టిటిడి కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లతో టెండర్లకు ఆమోదం. టిటిడి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్‌కాస్‌ తరహాలో టిటిడి కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం. టిటిడి ఉద్యోగుల హెల్త్‌ ఫండ్‌కు ఆమోదం. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం`2లో పలు ప్రత్యేక అభివృద్ధి పనులు మరియు మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.61 కోట్లతో టెండర్లకు ఆమోదం. స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌ రీసెర్చి భవనంలో అదనంగా 4, 5 అంతస్తుల నిర్మాణానికి రూ.4.46 కోట్లతో టెండర్లకు ఆమోదం.

 

 

టిటిడి ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, బోర్డు స‌భ్యులు   అశోక్ కుమార్‌,   ప్ర‌శాంతి రెడ్డి,   రాంభూపాల్ రెడ్డి,   జీవ‌న్ రెడ్డి, డా.చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి,   మ‌ల్లీశ్వ‌రి,   మారుతి ప్ర‌సాద్,   రామేశ్వ‌ర రావు,   నంద‌కుమార్‌,  క్రిష్ణారావు,   విద్యాసాగ‌ర్‌రావు,   ల‌క్ష్మీనారాయ‌ణ‌,   మొరంశెట్టి రాములు, డా.శంక‌ర్,   విశ్వ‌నాధ్,   మిలింద్ నర్వేకర్,   బోర సౌరబ్‌, డా.కెతన్ దేశాయ్‌,   స‌న‌త్‌కుమార్‌,  సంజీవ‌య్య‌, వ‌ర్చువ‌ల్‌గా  శ్రీ‌నివాస‌న్‌, రాజేష్ శ‌ర్మ పాల్గొన్నారు. అదేవిధంగా అద‌న‌పు ఈవో   ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు   స‌దా భార్గ‌వి,   వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Key decisions at the TTD Board of Trustees meeting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page