కూరగాయల రైతుల కుదేల్

0 9,693

విజయనగరం ముచ్చట్లు:

 

ఆరుగాలం పండించిన కాయగూరల పంటలు గులాబ్‌ దెబ్బకు నేలమట్టమయ్యాయి. ఆదాయం రాకపోగా, పెట్టిన పెట్టుబడులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో తుపాను దాటికి వరి, చెరకు, అరటి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కాయగూరల పంటలూ అదే స్థాయిలో దెబ్బతిన్నాయి. దీంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు. కానీ వీటి నష్టాన్ని గుర్తించడంలో ఉద్యానశాఖ అధికారులు తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గులాబ్‌ తుపానుతో జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. సుమారు వారం రోజులు పాటు ముంపు ఉండడంతో పంటలన్నీ మరింత దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వంగ, చిక్కుడు, బీర, ఇతర ఆకుకూరల పంటలన్నీ కుళ్లిపోయాయి. దీంతో ప్రతి రైతు ఎకరా పంట వద్ద రూ.30వేలు నుంచి రూ.50వేలు వరకు నష్టపోయారు. జిల్లాలోని 2 వేల ఎకరాల్లో కాయగూరల పంటలు దెబ్బతినగా, జామి మండలంలో 200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఒక్క జామి మండల కేంద్రమే కాదు, మండలంలోని రామయ్యపాలెం, లక్ష్మీపురం, జాగారం, పావాడ గ్రామాలతో పాటు ఎస్‌.కోట తదితర మండలాల్లో కాయగూరల పంట నష్టం భారీగానే జరిగింది.రెండు ఎకరాల్లో కాయగూరలు పండిస్తున్నాను.

 

 

- Advertisement -

30సెంట్లలో వంగ తోట పూర్తిగా దెబ్బతింది. చిక్కుడు, ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో సుమారుగా రూ.50వేలు వరకు నష్టపోయాను.వరి పంటతో పాటు చెరకు మొక్కతోట పూర్తిగా నెలకొరిగింది. దీంతో 50శాతం పంట నష్టపోయినట్లే, అలాగే రెండు ఎకరాల్లో కాయగురలు పంట పోయి రూ.50వేలు పైన నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.గులాబ్‌ తుపానుకు పెద్దఎత్తున పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. కాయగూరల పంటలు దెబ్బతినడంతో రైతులు రోజువారీ ఆదాయం కోల్పోయారు. తక్షణమే కాయగూరల పంటల నష్టాలను అధికారులు గుర్తించి, ప్రభుత్వానికి నివేదించాలి. ప్రభుత్వం కూడా, వెంటనే నష్టపరిహారాలు ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Kudel, a vegetable farmer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page