పాకిస్తాన్లో భారీ భూకంపం..

0 7,521

20 మంది మృతి..వందలాది మందికి గాయాలు.

.
న్యూఢిల్లీ    ముచ్చట్లు:

- Advertisement -

భారీ భూకంపంతో పాకిస్తాన్ చిగురుటాకులా వణికిపోయింది. గురువారం ఉదయం పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో సంభవించిన భారీ భూకంపంతో 20మంది మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని హర్నోయ్ జిల్లా లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.  క్వెట్టా, సిబ్బి, పిశిన్, ముస్లీం బాగ్, జియరత్, ఖిలా అబ్దుల్లా, సంజవి, జోబ్, చమన్ ప్రాంతాల్లో భుప్రకంపనాలు నమోదయ్యాయి. కాగా.. ఈ భూకంపం ధాటికి 20 మంది చనిపోయారని, 300 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు వెల్లడించారు. రక్తం నిల్వలు, అంబులెన్సులు, హెలికాప్టర్లను అందుబాటులో వుంచామని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి జామ్ కమాల్ ఖాన్ అల్యాని చెప్పారు.  కాగా.. ప్రజలంతా నిద్రలో ఉండగా భారీ భూకంపం సంభవించింది. భవనాల పైకప్పులు కూలిపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు తెలిపారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Massive earthquake in Pakistan ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page