తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

0 9,858

తిరుచానూరు ముచ్చట్లు:

 

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మ‌వారు భక్తులకు దర్శనమిస్తారు.ఈ సంద‌ర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ఊంజల్‌సేవ నిర్వహించారు.అక్టోబరు 15వ తేదీనాడు ఆల‌యంలో గజ వాహనంపై అమ్మ‌వారిని వేంచేపు చేసి ఆస్థానం చేప‌డ‌తారు. ఈ ఉత్స‌వాల కార‌ణంగా అన్ని ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో క‌స్తూరిబాయి, ఏఈవో  ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు  బాబుస్వామి, సూప‌రింటెండెంట్  శేష‌గిరి టెంపుల్ ఇన్స్‌పెక్టర్  రాజేష్ పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Navratri festivities begin at Thiruchanur Sri Padmavati Ammavari Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page