బెట్టింగ్ లుతో  మా ఎన్నికలు

0 2

హైదరాబాద్  ముచ్చట్లు:

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై బెట్టింగ్‌లతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయం మొదలైంది. సాధారణంగా ఎన్నికలన్నాక ఓటేయండని రిక్వెస్ట్ చేస్తారు. బతిమాలుకుంటారు. కొన్ని సందర్భాల్లో తాగుడు, తాయిళాలు కూడా ఉంటాయి. కానీ మా ఎన్నికల్లో కొత్త సంస్కృతి మొదలైంది. అదే బ్లాక్‌మెయిలింగ్‌ పాలిటిక్స్‌.నాకు నచ్చిన ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా. ఇది ఓ దర్శకుడి అల్టిమేటమ్‌. అవును.. మా ఎన్నికల్లో భాగంగా కాల్‌ చేసిన ఓ డైరెక్టర్‌ మొహమాటం లేకుండా డైరెక్ట్‌గా అదే మాట అనేశాడు. ఇదే మాటను ట్వీట్‌ చేశాడు ఆర్‌ఎక్స్‌ 100 మూవీ దర్శకుడు అజయ్‌భూపతి. ఆయనకు ఏ డైరెక్టర్‌ కాల్‌ చేసి అలా అన్నారన్నది మాత్రం వెల్లడించలేదు.అయితే ఒకటి మాత్రం కన్‌ఫామ్‌.. ఓట్ల కోసం బ్లాక్‌మెయిలింగ్‌ జరుగుతుందని ఇన్నాళ్లు ఇన్నర్‌ టాక్‌గానే వినిపించేది. కానీ ఇప్పుడు మాత్రం అది నిజమని తేలిపోయింది. ఇంతకీ ఆ డైరెక్టర్‌ ఎవరు..? ఆయన మద్దతిస్తున్న ప్యానల్ ఏంటన్న చర్చ ఫిలింనగర్‌లో జోరందుకుంది. ఇప్పుడు ఓ డైరెక్టర్‌ పేరు మాత్రమే బయటికొచ్చింది. కానీ ఇలాచాలా మంది చాలారకాలుగా కాల్స్‌ చేస్తూ వార్నింగ్‌లకు దిగుతున్నారనే ప్రచారం నడుస్తోంది.మామూలుగా జనానికి మా ఎలక్షన్స్‌అవసరమే లేదు..కానీ జరుగుతున్న పరిణామాలతో అటెన్షన్ మొత్తం చేంజ్ అయింది. ఏదో సాధారణ ఎన్నికల్లా బెట్టింగ్‌లు, బ్లాక్‌మెయిలింగ్‌కి దిగుతున్నారంటే మా ఎన్నికలు ఏ స్థాయికి వెళ్లిపోయాయో అర్థమవుతుంది.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Our election with betting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page