దసరా ఉత్సవాలకు అనుమతి

0 9,807

విజయవాడ ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది.దసరా ఉత్సవాలకు సంబంధించి తాజాగా కీలక ప్రకటన చేసింది.ఈ మేరకు రాష్ట్రంలో దసరా ఉత్సవాలకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.కాగా, దీనిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన జారీ చేశారు.అమ్మవారి మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.అలాగే భక్తులందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.అలాగే, విజయవాడ ఇంద్రకీలాద్రీపై జరగనున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Permission for Dussehra celebrations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page