లఖింపుర్‌ ఖేరి ఘటనపై విచారణ వాయిదా.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు..

0 7,565

న్యూఢిల్లీ ముచ్చట్లు:

యూపీ లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేసు విచారణ సందర్భంగా కమిషన్‌ వేశామని కోర్టుకు తెలిపింది యూపీ సర్కార్‌. దీంతో శుక్రవారంలోగా ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించిన సుప్రీం.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది కేంద్రమంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందగా..ఆ తర్వాత జరిగిన ఘర్షణలో మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్ట్‌. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఘటనపై విచారణ జరిపింది.ఇదిలావుంటే.. లఖింపుర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలకు గురువారం ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పరిహారం అందించింది. ఒక్కో కుటుంబానికి రూ. 45 లక్షల విలువైన చెక్కును అందించింది. మృతుల్లో నలుగురు రైతులు, ఇద్దరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఒక డ్రైవర్, ఒక జర్నలిస్టు ఉన్నారు. ఆ ఎనిమిది కుటుంబాలకు ఈ రోజు చెక్కులు అందించినట్లుగా యూపీ సర్కార్ ప్రకటించింది. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Supreme Court adjourns hearing on Lakhimpur Kheri incident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page