మహిళల అభివృద్దికి కట్టుబడి ఉన్నాం : జగన్

0 12

ఒంగోలు      ముచ్చట్లు:

మహిళ రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులను సంక్షేమ పధకాల ద్వారా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. చేయూత కార్యక్రమం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. నాలుగేళ్ల పాటు ప్రతీ ఏడాది మహిళలకు ఆర్ధిక సాయం అందిస్తామని తెలిపారు. ఒంగోలులో వైఎస్సార్ ఆసరా పధకం రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం.. కడప జిల్లా మినహా రాష్ట్రమంతా ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు డ్వాక్రా మహిళల అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయని స్పష్టం చేశారు. రెండో విడత సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి రూ. 6439.52 కోట్లు జమ చేస్తున్నామని సీఎం అన్నారు. 4 విడతల్లో మొత్తంగా రూ. 25,512 కోట్లు జమ చేస్తామని ప్రకటించారు. అటు కడప జిల్లాలో నవంబర్ 6 నుంచి 15 వరకు ఆసరా పధకం అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో పొదుపు సంఘాలు నిర్వీర్యమైపోయాయన్నారు. రుణ మాఫీ చేస్తామని చెప్పి డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. సున్నా వడ్డీ పధకాన్ని కూడా రద్దు చేశారని.. తమ ప్రభుత్వమే తిరిగి ప్రారంభించిందని చెప్పుకొచ్చారు.

- Advertisement -

ప్రభుత్వం సహాకారం డ్వాక్రా సంఘాలు తిరిగి నిలబడ్డాయన్నారు. పంచాయతీ, మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, తిరుపతి ఉప ఎన్నికల వరకు తమకు దక్కిన ప్రజా ఆదరణ మరువలేనిదని సీఎం వైఎస్ జగన్ అన్నారు.పధకం ద్వారా కోటి మంది మహిళలకు రూ. 2,300 కోట్ల రూపాయలు చెల్లుస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అలాగే జగనన్న అమ్మఒడి పధకం ద్వారా 44.50 లక్షల తల్లులకు, 85 లక్షల పిల్లలకు రూ. 6,500 కోట్ల చొప్పున రూ. 13,025 వేల కోట్ల రూపాయలు అందించామన్నారు. గతంలో 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఇప్పుడు 61 లక్షల మందికి రూ. 2,250 రూపాయల చొప్పున నెలకు రూ. 14 వేల కోట్లు జమ చేస్తున్నామని సీఎం అన్నారు. అటు ఆసరా పధకం ద్వారా 78.76 లక్షల మంది మహిళలకు రూ. 12,758 కోట్లు రెండు విడతలుగా.. చేయూత ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ మహిళలకు రెండు విడతలుగా రూ. 8,944 వేల కోట్లు చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని నాలుగోవంతు ప్రజలకు ఇళ్ళస్థలాలను అందించామని.. ఇళ్ళ నిర్మాణం కోసం నేరుగా మహిళల ఖాతాల్లో 5 లక్షలు జమ చేశామన్నారు.జగనన్న విద్యాదీవెన, ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ ద్వారా 18.21 వేల మంది తల్లులకు 5,500 వేల కోట్ల రూపాయలు.. వసతి దీవెన ద్వారా 15.58 వేల మంది పిల్లల కోసం నేరుగా 2,270 కోట్ల రూపాయలు చెల్లుస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. పంచాయతీ, మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, తిరుపతి ఉప ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని.. వారికి ఎంత చేసినా తక్కువేనని సీఎం జగన్ అన్నారు.మరోవైపు దేశ చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్‌ పదువులు, కాంట్రాక్ట్‌లు మహిళలకు దక్కేలా శాసనసభలో చట్టం తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. హోంమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మహిళలకు స్థానం కల్పించాం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను నియమించాం. స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో 52 శాతం మహిళలకు అవకాశం ఇచ్చాం. జడ్పి ఛైర్మన్‌లుగా 13 స్థానాల్లో 7 స్థానాల్లో మహిళలకు అవకాశం ఇచ్చాం. ప్రకాశం జిల్లా జడ్పి ఛైర్మన్‌గా మహిళను చేశాం. 26 వైస్‌ ఛైర్మన్లు ఉంటే 15 మంది మహిళలకు అవకాశం ఇచ్చాం.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:We are committed to the advancement of women: Jagan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page