ఈ.శ్రమ్ కార్డు గురించి అవగాహన కల్పించి ప్రారంభించిన సహాయ కార్మిక కమిషనర్ ఎస్ బసురున్ని సా బేగం

0 7,579

నంద్యాల    ముచ్చట్లు:

గురువారం రాత్రి బైటి పేట లో స్లాబ్ కాంక్రీట్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సహాయ కార్మిక కమిషనర్ ఎస్ బసురున్ని సా బేగం  ముఖ్య అతిథులుగా హాజరై ఈ . శ్రమ్ కార్డు గురించి అవగాహన కల్పించి ప్రారంభించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి ఏయమ్ డి సమీర్   జూనియర్ అసిస్టెంట్ జీ వెంకటేశ్వరరావు  సీయస్ సి సెంటర్ మక్బూల్  పాల్గొనడం జరిగిందని అన్నారు.ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి  కె ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సహాయ కార్మిక కమిషనర్ శ్రీమతి ఎస్ బసురున్ని సా బేగం  మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఈ. శ్ర మ్ కార్డు నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో చేరిన ప్రతి అసంఘటిత రంగ కార్మికునికి 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు (యుఏయన్ ) యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందని ఈ కార్డు ఉంటే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుందన్నారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికునికి ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్షిత బీమా యోజన (పీ యమ్ యస్ బి వై) క్రింద రెండు లక్షల రూపాయలు ప్రమాద మరణ. అంగవైకల్యం భీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులను ఉద్దేశించి చేసే పథకాలు. విధానాలకు ఈ డేటా బేస్ నే ప్రమాణికంగా తీసుకుంటారని చెప్పారు. కనుక తప్పనిసరిగా ఉచితంగా నమోదు చేసే ఈ. శ్ర మ్ కార్డును ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్లాబ్ కాంక్రీట్ వర్కర్స్ యూనియన్ నాయకులు సాల మద్దిలేటి మద్దయ్య యాకోబు బాల శేషులు తో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Assistant Labor Commissioner S Basurunni Sa Begum, who started by creating awareness about the E-Shram card

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page