ఆటో కార్మికుల ధర్నా.

0 8,758

వేములవాడ  ముచ్చట్లు:

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ఉచిత బస్సు ప్రారంభించడానికి ఆలయ అధికారులు సంసిద్దమవుతుంటే  మా పొట్టను కొట్టదంటూ వేములవాడ పట్టణ ప్రధాన బస్టాండ్ వద్ద ఆటో కార్మికుల భారీ ధర్నా చేపట్టారు. మమ్ములను  ఆకలికి చంపదంటూ ఆటో కార్మికులు ఆవేశం తో వారి ఆటోను దగ్ధం చేసి నిరసన తెలుపారు.  ఉచిత లోకల్ బస్సులు పెట్టిడం తో మా కుటుంబాలు రోడ్డు మీద పడక తప్పదని, గుడికి వచ్చే భక్తుల పై ఆధారపడి ఆటో లతో వెయ్యిల కుటుంబాలు బ్రతుకుతున్నామని, ఉచ్చిత బస్సులు ఏర్పాటు చేస్తే మాకు చావే దిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి ఆలయ ఉచ్చిత బస్సులను రద్దు చేస్తున్నట్లు చెప్పేదాక లెవ్వమని రోడ్డు పై బైఠాయించారు. రెండు గంటల పాటు రోడ్డు పై బైటాయించి ధర్నా చేపట్టడంతో  దాదాపు 10 కిలోమీటర్ల దూరం లో భారీ వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి సిఐ పోలీసు బృందం చేరుకొని సర్దిచెప్పిన వినకుండా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉండిపోయారు. స్థానిక తహశీల్దార్ మునేందర్ వచ్చి మీకు న్యాయం చేస్తామని, తాత్కాలికంగా రద్దు చేస్తున్నాము,  కలెక్టర్ కు విన్నవించి మీకు న్యాయం జరిగే విదంగా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆటో కార్మికులు శాంతించారు. అనంతరం ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగురి శ్రీనివాస్ మాట్లాడుతూ  ఈ రోజు దేవస్థానం కు చెందిన ఉచ్చిత బస్సులను ప్రారంభించడానికి తయారు చేశారని ఆ బస్సులు నడుపుతే వాటి కింద పడి సత్తామంటూ ఆయన అన్నారు.  తహశీల్దార్ హామీ ఇచ్చినట్లు బస్సులను రద్దు చేయాలని, లేదంటే మా బ్రతుకుల కోసం మా ఆటోనే కాల్చినం మా ప్రాణాలు మాకు పెద్ద లెక్క కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆలయం కు వచ్చే భక్తుల తోనే మా బ్రతుకులు అంటూ మా పై పోలీస్ జులుము చూపిస్తే మా భార్య పిల్లలతో  రోడ్డు పైకి వచ్చి ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమలో భారీ సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Auto workers’ dharna

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page