డేరా బాబా దోషే

0 7,586

హర్యనా ముచ్చట్లు:

లైంగిక వేధింపుల కేసులో శిక్ష అనుభవిస్తోన్న డేరా బాబాను తాజాగా ఓ హత్య కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. డేరా బాబా ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ సహా జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్, కృష్ణ లాల్, ఇందర్ సైన్‌లు కుట్ర పన్నినట్టు కోర్టు  తేల్చింది. వీరికి అక్టోబరు 12న శిక్షలను ఖరారు చేయనుంది. డేరా సచ్చా సౌదాలోనే రంజిత్ సింగ్ 2002 జులై 10న హత్యకు గురయ్యారు. డేరాలోని మహిళలపై జరిగే ఆకృత్యాలను గుర్మీత్ రామ్ చేస్తున్న అరాచకాలను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పడానికి అజ్ఞాత వ్యక్తి పేరుతో లేఖ రాసినట్టు రంజిత్ సింగ్‌ను అనుమానించాడని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. సదరు లేఖను సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి బాగా సర్కులేట్ చేశారు. అనంతరం ఆయన కూడా హత్యకు గురయ్యారని సీబీఐ తెలిపింది.హత్య గావించబడిన రంజిత్ సింగ్ హత్య కేసు దర్యాప్తు సక్రమంగా జరగడంలేదని బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో 2003 నవంబర్‌లో సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. అయితే, ఆ కేసును వేరే సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రెండు రోజుల క్రితం న్యాయమూర్తులు కొట్టేశారు. బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. తాజాగా పంచకులలోని సీబీఐ కోర్టు డేరా బాబాతో పాటు మరో నలుగురు అనుచరులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. కాగా ఇప్పటికే ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబా 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2017లో అతడిని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. బుర్జ్ జవహర్ సింగ్ వాలా గురుద్వారా నుంచి గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథం దొంగతనం కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Dera Baba Doshe

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page