శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం లో రెండవ రోజు మహాలక్ష్మి అలంకారం

0 9,691

చౌడేపల్లె ముచ్చట్లు:

 

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రుల మహ్గత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారిని మహాలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిల ఆధ్వర్యంలో ఆలయంలో ఉదయాన్నే శుద్దిచేసి , మంగళ హారతులతో అమ్మవారిని మేల్కొల్పి పట్టుపీతాంబరాలు,పరిమళభరిత పుష్పమాలికలు ,విశేషాభరణాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారితో పాటు గర్భాలయంను పూలతో అలంకరించారు. వేదపండితులు గోవర్థనశర్మ, గంగిరెడ్డితో పాటు అర్చక బ-ందం ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద మంత్రోచ్చారణల మద్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉభయదారులచే గణపతి పూజ, అభిషేకాలు, అర్చనలు, ఊంజల్‌సేవ, గణపతిహ్గమం, చంఢీహ్గమంతో పాటు పూర్ణాహుతి చేశారు. పూజా కార్యక్రమాల తరువాత భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

- Advertisement -

శాఖాంబరీదేవి అలంకారంలో అమ్మవారు…….

దసరా మహ్గత్సవాల్లోభాగంగా మూడవ రోజైన శనివారం అమ్మవారు శాఖాంబరీదేవి ఆలంకారంలో భక్తులకు దర్శనబాగ్యం కల్పించనున్నట్లు ఈఓ చంద్రమౌళి తెలిపారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; Mahalakshmi decoration on the second day at Sri Boyakonda Gangamma Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page