10న బోయకొండలో 10 గంటల తర్వాత అమ్మవారి దర్శనంకు అనుమతి

0 9,701

– మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేల పర్యటనఖరారు
– భద్రతా రిత్యా డిఎస్పీ గంగయ్య వెల్లడి
– కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

బోయకొండ గంగమ్మ దర్శనం ఆదివారం ఉదయం 10 గంటల తరువాత భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళి తెలిపారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పలమనేరు డిఎస్పీ గంగయ్య, పుంగనూరు సీఐ గంగిరెడ్డి తదితరులు కలిసి బోయకొండలో మంత్రి పర్యటన ఏర్పాట్లను తనిఖీ చేశారు.ఆదివారం అమ్మవారి కి రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలిసారిగా మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్పలతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో కలిసి బోయకొండకు రానున్నారు. ఈ పర్యటన దృష్ట్యా ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నందున సమస్య తలెత్తే అవకాశం ఉన్నందును ఆలయంలోనికి ఆదివారం 10 గంటల తర్వాత అనుమతించేలా ఆలయ అధికారులకు డిఎస్పీ సూచించారు. లక్షలాధిరూపాయల నిథులతో నిర్మించిన పుష్కరిణి, ఉపాధినిథులతో విలేజ్‌ పార్క్, విధ్యుత్‌దీకరణ పనులను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించనున్నట్లు చెప్పారు. విఐపీ వాహనాలను మాత్రమే బోయకొండ పైకి ఆలయం వద్దకు పంపాలని, మిగిలిన వాహనాలన్ని కొండ కింద ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పార్కింగ్‌ చేసేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట బూత్‌కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, సోమల మల్లికార్జునరెడ్డి, సదుం ఇంమ్రాన్‌, రమేష్‌బాబు, శ్రీథర్‌రెడ్డి,నవీన్‌ తదితరులున్నారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Permission to visit the Goddess after 10 a.m. at Boyakonda on the 10th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page