మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

0 9,033

-రామచంద్రపురం వైయస్సార్ ఆసరా సభలో  మంత్రి వేణు

 

రామచంద్రాపురం ముచ్చట్లు:

 

- Advertisement -

మహిళను అన్నిరంగాల్లోనూ అభివృద్ధి పరచాలని లక్ష్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ రెండో విడత ఆసరా పథకం కార్యక్రమం లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణు, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ,మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి పాల్గొన్నారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలకు దసరా పండుగకు కానుకగా వైయస్సార్ ఆసరా పథకం ఇవ్వడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు 18 కోట్ల 64 లక్షల రూపాయల చెక్కును మంత్రి వేణు మహిళా సంఘాలకు అందజేశారు .ఈ కార్యక్రమంలో మూడు మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొనగా వారిని మంత్రి తనయుడు నరేన్ సన్మానించారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; Economic development of women is a government goal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page