బాసరలో ఉత్సవాలు

0 9,863

నిర్మల్ ముచ్చట్లు:

 

నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీశారదీయదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 3వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  జ్ఞాన సరస్వతి అమ్మవారు చంద్రఘంటా అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  జపమాల, ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి పులి వాహనదారియై అభయముద్రతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ వైదిక బృందం అమ్మవారికి కొబ్బరి అన్నం ను నైవేద్యంగా నివేదించారు. నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారి అనుగ్రహంతో పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూతభయాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ వినోద్ రెడ్డి కోవిడ్-19 నిబంధనలకు లోబడి అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కర్ణాటక తదితర సుదూర ప్రాంతాల నుండి నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పవిత్ర గోదావరి నదిలోభక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి క్షేత్రంలో ఆలయ అర్చకులచేత తమ చిన్నారులకు తల్లిదండ్రులు అక్షర శ్రీకార పూజలను జరుపుకుంటున్నారు. నాందేడ్ జిల్లా గాడిపుర జగదీష్ మహారాజ్ ఆధ్వర్యంలో అమ్మవారి క్షేత్రంలో భక్తులకు ఉచితం అన్నదానప్రసాదంను అందిస్తున్నారు. బాసర వివేకానంద యూత్ సహకారంతో ధర్మాబాద్ వ్యాపారి అసోసియేషన్ అమ్మవారి ప్రాంగణంలోని వృద్ధులకు మహిళలకు చిన్నారులకు పాలు, బిస్కెట్లను, స్వీట్లను పంపిణీ చేస్తున్నారు. అమ్మవారి ఆలయ కోటి గాజుల మండపంలో ప్రతినిత్యం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను అధిక సంఖ్యలో భక్తులు తిలకిస్తున్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Festivities in Basra

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page