పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా సిబ్బందికి హెల్మెట్ పంపిణీ

0 9,686

నందిగామ ముచ్చట్లు:

స్థానిక నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా నందిగామ డిఎస్పీ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  పోలీస్ సిబ్బందికి హెల్మెట్ లను అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ నందిగామ రూరల్ సర్కిల్ పరిధిలోని కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వందమందికి హెల్మెట్ ల ను అందజేయడం జరిగిందని విధి నిర్వహణలో భాగంగా కుటుంబ స్థానిక పరిస్థితుల దృష్ట్యా వేరు వేరు చోట్ల ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని  తెలిపారు. ఇటీవల చిలకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం గుర్తు చేశారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా సిబ్బందికి హెల్మెట్లు అందజేయాలనే మంచి ఆలోచన ఆచరణలో పెట్టిన నందిగామ రూరల్ సిఐ నాగేంద్రకుమార్ ను ఇతర పోలీసు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు పోలీసు వ్యవస్థ నేటి పోలీస్ వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉందని ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి నేటి పోలీసులు సరైన నిర్వచనమని ఆయన కొనియాడారు.

 

 

 

- Advertisement -

కరుణ విలయతాండవం చేస్తున్న సమయంలో కూడా ప్రతి ఒక్కరు విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన విషయాన్ని ఆయన మరొకసారి గుర్తు చేసుకున్నారు. నందిగామ సబ్ డివిజన్ పరిధిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సిబ్బందికి హెల్మెట్ ల పంపిణీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వమని ఈ సందర్భంగా ఆయన కోరారు. నేటి ఉరుకుల పరుగుల జీవితం విధానంలో విధి నిర్వహణలో ఒక చోట నుండి మరొక చోటికి ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవింగ్ పైనే ధ్యాస ఉంచాలని  ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని ఆయన కోరారు. అనంతరం పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు అందించిన హీరో, హోండా,టీవీఎస్ మ,సుజుకి, బజాజ్ షోరూం సిబ్బందిని దు శాలువాలతో డీఎస్పీ మరియు ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రజిని, ఎంపీపీ మలక్ బషీర్, ఎస్ ఐ లు సుబ్రహ్మణ్యం, ఏసోబు, సోమేశ్వరరావు మహిళా ఎస్సై లక్ష్మి, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Helmet distribution to staff on the occasion of Police Welfare Day

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page