టీడీపీ అందోళన

0 9,015

విశాఖపట్నం ముచ్చట్లు:

 

అభివృద్ధి పేరుతో విశాఖలోని విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాక ఆస్తులను తాకట్టు పెట్టే నీచమైన సంస్కృతికి దిగజారిపోయారని తెదేపా నగర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సంక్షేమ పథకాలు అమలుకు ఇలా ఆస్థులన్నీ తాకట్టులు పెట్టేసి అమ్ముకుంటూ పోతే… భవిష్యత్తు తరాలకు ఏమి మిగులుస్తారని మండి పడ్డారు. సంపద సృష్టించడం తెలియని అసమర్ధ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇంచార్జ్ లు, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే విశాఖ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: TDP Concern

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page