అల్లుడిపై దాడి చేసిన మామ

0 9,860

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువు గ్రామంలో అల్లుడిపై మామ,బావమరిదిలు వేటకొడవలితో దాడిచేసారు.  దైద గ్రామానికి చెందిన దూదేకుల చిన్న ఖాసీం పదేళ్ళ క్రితం పెళ్ళి చేసుకొని తుమ్మలచెరువులోని అత్తారింటికి ఇళ్ళరికం వచ్చిన నాటి నుండి చెడువ్యసనాలకు బానిసై భార్యను వేధిస్తుంటాడని ఎన్నిసార్లు సర్ది చెప్పినా తీరు మార్చుకోని ఖాసీం మరలా గతరాత్రి పూటుగా తాగి భార్యపై గొడవకు దిగటంతో మామ పీరుసాహెబ్,బావమరిది శీనుభాషాలు ఎదురు దాడికి దిగి కొడవలితో నరకడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తస్రావం అవుతున్న ఖాసీంను ప్రవేట్ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు గ్రామీణ యస్.ఐ విజయ్ చరణ్ తెలిపారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; The uncle who attacked Alludi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page