పోలవరం నిధులపై స్పష్టత లేదు

0 9,689

రాజమండ్రి ముచ్చట్లు:

 

వైఎస్ జగన్ సర్కార్‌పై మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ఉండవల్లి ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని.. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని ఆయన అన్నారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? అని మాజీ ఎంపీ ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని ఆయన అన్నారు. ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డుకు దేశంలోని ఏ రాష్ట్రం ఒప్పుకోకపోయినా ఏపీ మాత్రం దీనికి ఒప్పుకుంది. పోలవరంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాజెక్ట్‌ పనులు పూర్తికాకపోయినా హడావుడిగా ప్రకటనలు చేస్తున్నారు. పోలవరం పనుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.4,068 కోట్లు కొర్రీలు వేశారు. పనులు పూర్తి కాకపోయినా మంత్రులు హడావుడి చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది. నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందడంలేదు. తాగునీటి విషయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వకపోవడం దారుణం. పోలవరం నిధులపై రాష్ట్రం ఏర్పాటు నుంచి చర్చ జరుగుతోంది. పోలవరం నిధులపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; There is no clarity on Polavaram funding

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page