గుడివాడ లో వంగవీటి పోటీ

0 9,694

విజయవాడ ముచ్చట్లు:

 

రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహం మార్చుకుంటూ ఉండాలి. మూస పద్ధతిలో పోతే గట్టెక్కడం కష్టమే. ప్రధానంగా బలమైన నాయకులు ఉన్నప్పుడు స్ట్రాటజీ మారుస్తుండాలి. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ గట్టెక్కడానికి అన్ని రకాలుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈసారి కొడాలి నాని ఎలాగైనా ఓడించాలన్న కసితో ఉన్నారు. అందుకే సామాజికవర్గాలను బేరీజు వేసుకుని ఈసారి గుడివాడ కాండిడేట్ ఎంపిక ఉండనుంది.గుడివాడ నియోజకవర్గంలో తొలి నుంచి కమ్మ సామాజికవర్గం నేతలే ఎన్నికవుతూ వస్తున్నారు. 1983లో పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత రావి శోభనాద్రీశ్వరి ఎన్నికయ్యారు. అక్కడి నుంచి మొన్నటి కొడాలి నాని వరకూ అందరూ కమ్మ సామాజికవర్గం నేతలే గుడివాడ నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ అభ్యర్థిగా కఠారి ఈశ్వరకుమార్ పోటీ చేసి కమ్మ సామాజికవర్గేతర ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.గుడివాడలో ఇప్పటి వరకూ కమ్మ సామాజికవర్గం నేతకే టీడీపీ టిక్కెట్ ఇస్తూ వస్తుంది. గత ఎన్నికల్లోనూ కొడాలి నాని పై విజయవాడ నుంచి దేవినేని అవినాష్ ను బరిలోకి దింపింది. అయితే ఈసారి రూటు మార్చాలని చంద్రబాబు నిర్ణయించారు. కమ్మ సామాజికవర్గం వైసీపీ పై గుర్రుగా ఉంది. అమరావతి రాజధానిని మార్చడం, కమ్మ సామాజికవర్గం పై కక్ష సాధింపులు వంటివి ఆ వర్గం తమకు ఎటూ అండగా ఉంటుంది.అందుకే ఈసారి గుడివాడలో కమ్మ సామాజికవర్గం నేత కాకుండా ఇతర కులాల నుంచి అభ్యర్థిని టీడీపీ బరిలోకి దింపే అవకాశముంది. ఇందులో వంగవీటి రాధా పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. వంగవీటి రాధాను గుడివాడలో బరిలోకి దింపితే చుట్టుపక్కల మచిలీపట్నం, పెడన నియోజకవర్గాలపై కూడా ప్రభావం ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకే ఈసారి గుడివాడలో కమ్మేతర నేతను చంద్రబాబు బరిలోకి దింపనున్నట్లు టాక్.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Vangaveeti competition in Gudivada

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page