పేపర్‌ రోల్‌ గోదామ్‌లో భారీ అగ్నిప్రమాదం

0 9,862

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

దేశ రాజధాని ఢిల్లీలోని హర్ష్‌ విహార్‌లో ఉన్న పేపర్‌ రోల్‌ గోదామ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది క్రమంగా అవి గోదామ్‌ మొత్తానికి విస్తరించాయి. మంటల ధాటికి మూడంతస్తుల గోదామ్‌ కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 16 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.గోదామ్‌లో పనిచేస్తున్న కార్మికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరూ గాయపడలేదని చెప్పారు. సోమవారం తెల్లవారుజామున 3.36 గంటలకు తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ అతుల్‌ కుమార్‌ తెలిపారు. మంటలను అదుపు చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టిందని వెల్లడించారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: A huge fire broke out in a paper roll warehouse

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page