మంచం పట్టిన కూనపుట్టు గిరి వాసులు-స్పందించని వైద్య అధికారులు

0 9,864

విశాఖపట్నం ముచ్చట్లు:

 

డుంబ్రిగుడ మండలంలో గల గుంటగన్నెల పంచాయతీ పరిధి ఉన్న కూనపుట్టు గ్రామ గిరిపుత్రులు జ్వరాలు తలనొప్పులు,ఒళ్ళు నొప్పులతో గత నాలుగు రోజులుగా వైద్య సేవలు అందక మంచాన పడ్డారు.ఈ సమాచారం తెలుసుకున్న గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సూర్యనారాయణ కమిటీ సభ్యులతో గ్రామంలో సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలు గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారు కొరా.కౌసల్య(26)కిలో.మధు(12)కిలో.గష్యాని(45)కొరా.పండన(55)కొరా.లక్ష్మి(50)కొరా.రాధమ్మ(35)తాంగుల.బిమల(50)కిలో.శ్రీదేవి(12)కిలో.గాసిరాం(38)కిలో.సరస్వతి(6)కిలో.జిమ్మిరి(45)కిలో.రామారావు(28)కొరా.గురుమూర్తి(47)కొరా.చంద్రకళ వీరంతా జ్వరాలు జలుబు లతో మంచము నుంచి లేవలేని స్థితిలో ఉన్నారన్నారు.సంబంధిత వైద్య అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కిలో.సద్దు,కిలో.జగన్నాథం,కొరా.గాసిరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Bedridden Koonaputtu Giri residents-unresponsive medical officers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page