ఇంట్లో డ‌బ్బులు లేక‌పోతే ఆ ఇంటికి తాళం ఎందుకు వేశావు?

0 9,271

– క‌లెక్ట‌ర్‌ను ప్ర‌శ్నిస్తూ దొంగ‌ల లేఖ

 

భోపాల్ ముచ్చట్లు:

 

 

- Advertisement -

ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో క‌లెక్ట‌ర్‌ ఇంట్లో దొంగ‌లు ప‌డ్డారు. ఇంట్లో ఉన్న రూ. 30 వేలు, బంగారు ఆభ‌ర‌ణాలను దొంగ‌లు అప‌హ‌రించారు. ఈ సందర్బంగా ఇంట్లో డ‌బ్బులు లేక‌పోతే ఆ ఇంటికి తాళం ఎందుకు వేశావు? అని దొంగ‌లు క‌లెక్ట‌ర్‌ను ప్ర‌శ్నిస్తూ ఓ లేఖను వ‌దిలి వెళ్లిపోయారు. ప‌దిహేను రోజుల త‌ర్వాత ఇంటికి తిరిగొచ్చిన క‌లెక్ట‌ర్ ఆ లేఖను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో వ‌స్తువుల‌న్నీ చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయి. రూ. 30 వేలు, బంగారు ఆభ‌ర‌ణాలు అప‌హ‌రించిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌కు స‌మీపంలో చోటు చేసుకుంది.భోపాల్‌కు రెండున్న‌ర కిలోమీట‌ర్ల దూరంలోని సివిల్ లైన్స్‌ లోని త్రిలోచ‌న్ గౌర్ బంగ్లాలో ఓ క‌లెక్ట‌ర్ నివాసం ఉంటున్నాడు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: If there is no money in the house, why did they lock the house?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page