మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు    

0 9,694

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

 

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంట‌లకు  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో  సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. మొదట రంగనాయకుల మండపంలో పల్లకిలో మోహినీ అవతారంలో ఉన్న స్వామివారిని, శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేశారు. అక్కడి నుండి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకెళ్లారు.

 

- Advertisement -

మోహినీ అవతారం – మాయా మోహ నాశ‌నం

 

ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.        ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి శ్రీ కోన రఘుపతి, టిటిడి ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి,  సనత్ కుమార్, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో  బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

గ‌రుడ వాహ‌నం –

 

కాగా రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షించనున్నారు.

 

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

 

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Jaganmohanakaru in the incarnation of Mohini

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page