పార్టీ బలోపేతం కోసం ఆళ్లగడ్డ కు వస్తానన్న నాదెండ్ల మనోహర్

0 9,701

– ఆళ్లగడ్డ జన సేన నాయకుడు మైలేరి మల్లయ్య

నంద్యాల ముచ్చట్లు:

- Advertisement -

సోమవారం నాడు ఓ ప్రకటనలో మైలేరి మల్లయ్య మాట్లాడుతూ  ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ  పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసినప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గ సమస్యలు తెలియజేసినట్లు తెలిపారు. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గం లో జనసేన పార్టీ బలోపేతంపై చర్చించడం జరిగిందని అన్నారు . నాదెండ్ల మనోహర్ గారికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల నుంచి వైసిపి, టిడిపి పార్టీల నుండి  నాయకులు జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడం జరిగిందన్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతంపై కొన్ని సూచనలు సలహాలు తెలియజేశారు , త్వరలో కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం కు వస్తానని  తెలియజేశారు .  ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ జనసేన నాయకులు రాచంశెట్టి  వెంకటసుబ్బయ్య, పసుల నరేంద్ర యాదవ్, బావికాడి గుర్రప్ప, ఆంజనేయులు, రాజారామ్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Nadendla Manohar is coming to Allagadda to strengthen the party

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page