జాతీయ రహదారిపై జోరుగా వ్యభిచారం

0 9,727

గుంటూరు ముచ్చట్లు:

 

హైవే పై వ్యభిచారం. నడింపాలెం జాతీయ రహదారిపై జోరుగా వ్యభిచారం. నిర్భయంగా రోడ్డుపై నిలబడి తళుకు బెళుకులతో విటులకు గాలం. రాత్రయితే చాలు, ఆ హైవేపై ఇదే తంతు. పట్టించుకోని అధికారులు. ఈ వ్యభిచార బాగోతం అంతా ఏ మారుమూల గ్రామాల్లో జరుగుతున్న తంతు కాదు. గుంటూరు అర్బన్ పోలీస్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో. జాతీయ రహదారిపై. ప్రత్తిపాడు మండలం నడింపాలెం – యనమదల మధ్య హైవే పై ఈ వ్యభిచార బాగోతం జంకూబొంకూ లేకుండా యథేచ్ఛగా జరుగుతుంది.ఈ ప్రాంతంలో ఇంజినీరింగ్ కళాశాలలు, వసతి గృహాలు, పెద్ద పెద్ద ఆస్పత్రులు, వందల సంఖ్యలో రకరకాల మిల్లులు ఉండటంతో విటుల కోసం వల వేస్తున్నారు. ఇదేదో రహస్యంగానో లేక గుట్టుచప్పుడు కాకుండానో జరుగుతుందనుకుంటే పొరబాటే. అంతా బహిరంగంగానే. విటులకు వల వేయడం మొదలు, కవ్వింపులు, బేరసారాలు , (…… )అన్నీ అక్కడే నడి రోడ్డు పైనే. ఇంతా జరుగుతున్నా ఎవ్వరూ ఇదేమని నోరు మెదపరు. నిలువరించే ప్రయత్నమూ చెయ్యరు.పొట్టకూటి కోసం పడుపు వృత్తిని ఎంచుకున్న వారి సంగతి అటుంచితే.. అక్కడ ఆగి బేరమాడే వారిలో మద్యం సేవించినవారు, రకరకాల వ్యక్తులు ఉంటున్నారు. పొరబాటున మద్యం మత్తులో ఎవ్వరైనా దారుణాలకు ఒడిగడితే .? ఎవరిది బాధ్యత.? అని మదన పడుతున్నారు ఆ ప్రాంత ప్రజలు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Prostitution rampant on the national highway

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page