ఆలయాలే టార్గెట్…….!

0 7,862

-జగిత్యాలలో రెచ్చిపోతున్న దొంగలు
-కలవరపెడుతున్న వరుస దొంగతనాలు
-పోలీసులు రాత్రి వేళల్లో గస్థీ ముమ్మరం చెయలంటున్నా ప్రజలు

జగిత్యాల  ముచ్చట్లు:

- Advertisement -

జగిత్యాల పట్టణంలో ఆలయాలే టార్గెట్ గా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు.ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురణిపేట లోని లోకమాథా పొచమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది.దొంగలు ఆలయాల్లో రాత్రి వేళల్లో చొరబడి విలువైన ఆభరణాలు, నగదు, ఇతర కానుకలు ఎత్తుకెళ్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయాల భద్రత ప్రశ్నార్థకంగా మారగా వరుస చోరీలు పట్టణ ప్రజలను కలవరపెడుతున్నాయి. రాత్రివేళల్లో  పోలీసులు గస్థీ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.  పట్టణంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న రామాలయంలో గడిచిన రెండు సంవత్సరాల్లో 7సార్లు దొంగతనం జరిగింది. కొన్ని నెలల క్రితం విద్యానగర్ రామాలయం లో దొంగలు చొరబడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. మంచినీళ్ళ భావి సమీపంలోని దగ్గులమ్మ గుడిలో కూడా దొంగతనం జరిగింది. కాగా తాజాగా సోమవారం పట్టణంలోని పురాని పెట్ లో గల గాజుల పోచమ్మ ఆలయంలో దొంగతనం జరుగడం చర్చనీయాంశంగా మారింది. ఆలయాలే టార్గెట్ గా దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడు తుండగా జగిత్యాలలో ఆలయాల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. ఆపరేషన్ చబుత్రా వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న పోలీసులు పట్టణంలోని వీధుల్లో రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసినట్లయితే వరుస దొంగతనాలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags:Temples are the target …….!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page