సప్తమాతృకల ప్రకారం నేడే సద్దుల బతుకమ్మ…

0 9,661

-బతుకమ్మ ఏర్పాట్లకు 20 లక్షల నిధులు కేటాయింపు
-కొనసాగుతున్న బతుకమ్మ ఏర్పాట్లు

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:

- Advertisement -

తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ..
వేములవాడ లో ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఆడపడుచులకు రెండు సార్లు అవకాశం ఉంటుంది.
సప్తమాతృకలు బ్రహ్మీ, మహేశ్వరి,కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండా, ఇంద్రనీ అమ్మవార్లను పూజిస్తారు వేములవాడ లో మాత్రం సప్తమాతృకల అవతారాలలో ఒకటైన వారాహి అమ్మవారికి పూజలు చేయడం ద్వారా 7రోజుల్లో సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో అయ్యేరుపల్లి మినహా అన్ని చోట్ల ఏడు రోజులకె బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటూ ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొమ్మిది రోజులలో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రంగి లో మాత్రం దసరా అనంతరం సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. వేములవాడకు చెందిన ఆడపడుచులు తమ తల్లి గారి ఇంట్లో ఏడు రోజుల సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించుకొని,9వ రోజు తమ అత్తగారింట్లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. నేడు జరగనున్న సద్దుల బతుకమ్మకు ప్రతి ఆడపడుచు తమ తల్లి గారి ఇంటికి వచ్చి సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు.

రూ 20 లక్షలతో బతుకమ్మ పనులు..
నేటి సద్దుల బతుకమ్మ ఏర్పాట్ల కోసం వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో రూ20 లక్షల నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని గుంతలను మొరం పోసి చదును చేయడం, బతుకమ్మ తేప్పకు రంగులు వేయడం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం,సుభాష్ నగర్ నుండి బతుకమ్మ వరకు బారికేడ్లు ఏర్పాటు చేయడం, మున్సిపల్ పరిధిలోని పలు కూడలిలో విద్యుత్ దీపాల అలంకరణ, మూలవాగు లో మహిళలు బతుకమ్మ ఆడుకొనుటకు ప్రత్యేక విద్యుద్దీపాలను అమర్చడం తదితర వాటి కోసం నిధులు కేటాయించి పనులు నిర్వహించారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags; According to the Saptamatrikas, today’s Saddula Bathukamma …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page