డ్వాక్రా గ్రూపులకు ఆసరా చెక్కుల పంపిణీ

0 9,862

పాలకొల్లు ముచ్చట్లు:

 

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు డ్వాక్రా మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతోనే వైయస్సార్ ఆసరా పథకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని జడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ తెలిపారు. పాలకొల్లు పట్టణం లైన్స్ క్లబ్ సమావేశ హాలులో డ్వాక్రా గ్రూపు మహిళలకు ఆసరాచెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొమ్మిది వార్డులోని డ్వాక్రా మహిళలకు సుమారు మూడు కోట్లఆసరా చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నవరత్నాలు పథకం ద్వారా అవినీతికి తావు లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి దక్కింది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్ ,మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎడ్ల తాతాజీ, గూడూరు పెద్దిరాజు చిలుకూరి దత్తాత్రేయవర్మ, సాందక సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Distribution of support checks to Dwakra groups

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page