ఇంటి చికిత్స కే మొగ్గు

0 9,779

హైద్రాబాద్ ముచ్చట్లు:

 


కరోనా సోకి ఆసుపత్రులకు చేరే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సెప్టెంబరుతో పోల్చితే ప్రస్తుతం సుమారు 45 శాతం మంది రోగులు తగ్గినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజు వైరస్ సోకుతున్న వారిలో 70 శాతం మంది ఇంటి చికిత్సకు మొగ్గు చూపుతున్నారని, ఈక్రమంలోనే ఆసుపత్రుల్లో చేరే పేషెంట్లు తగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు నెలలో ప్రభుత్వాసుపత్రుల్లో సగటున 3వేల మంది చికిత్స పొందగా,(ఐసొలేషన్, ఆక్సిజన్, వెంటిలేటర్ కలిపి) ప్రైవేట్‌లో 4వేల మంది చేరారు. కానీ ప్రస్తుతం కోవిడ్‌తో ప్రభుత్వాసుపత్రుల్లో చేరే సంఖ్య సగటున 1800 ఉంది. అదే విధంగా 230 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం వెయ్యి మంది మాత్రమే చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గత నెలతో పోల్చితే వైరస్ తీవ్రత తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.సెప్టెంబరు 8,9,10వ తేదిల్లో ప్రభుత్వాసుపత్రుల్లో 8052(ఐసోలేషన్, ఆక్సిజన్, వెంటిలేటర్) బెడ్లు ఉండగా సగటున 2660 మంది పేషెంట్లు చేరారు. ప్రైవేట్‌లో 10,433 పరుపులను అందుబాటులో ఉంచగా సగటున 4231 మంది రోగులు చికిత్స నిమిత్తం చేరారు. అదే విధంగా ప్రస్తుతం గత మూడు రోజుల నుంచి(8,9,10వ తేదిల్లో) ప్రభుత్వాసుపత్రుల్లో 8800 బెడ్లను అందుబాటులో ఉంచగా సగటున కేవలం 1840 పేషెంట్లు మాత్రమే చేరారు. మరోవైపు ప్రైవేట్‌లో 9200 బెడ్లను అందుబాటులో ఉంచగా సగటున 2700 పేషెంట్లు మాత్రమే చికిత్స పొందుతున్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. అంటే సెప్టెంబరు నెలతో పోల్చితే సుమారు 45 శాతం మంది రోగులు తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత మంది తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు.కరోనా చికిత్సను అందించే ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లు కోసం వేచిచూస్తున్నాయి. గతంలో బెడ్ల కోసం క్యూ కట్టిన పేషెంట్లు ప్రస్తుతం రాకపోవడంతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా వార్డులను తొలగించే ప్రయత్నంలో ఉన్నాయి.ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించడం వలనే పేషెంట్లు ప్రైవేట్‌కు వెళ్లడం లేదని ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు. అంతేగాక అతి ఖర్చుతో కూడిన వైద్యానికి ఇనాళ్లు అత్యధిక ఫీజులు వసూల్ చేయడంపై కూడా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. భారీ ఫీజులు వసూల్ చేసిన ఆసుపత్రులపై గతంలో కోర్డులు సైతం సీరియస్ అయ్యారు. ఈక్రమంలో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేందుకు కరోనా బాధితులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ప్రభుత్వ అందిస్తున్న వైద్యంపై ప్రజల్లో భరోసా పెరిగింది.

 

 

- Advertisement -

గాంధీ ఆసుపత్రిలో అతి క్రిటికల్ కండీషన్‌తో చేరి చాలా మంది కోలుకోవడంతో ప్రజల్లో మనోధైర్యం పెరిగింది. దీంతో కరోనా సోకితే సర్కార్ వైద్యం మాత్రమే పొందాలని చాలా మంది భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం వైరస్ సోకుతున్న వారిలో అత్యధిక మంది అసింప్టమాటిక్ పేషెంట్లు ఉండటం వలనే ఆసుపత్రుల్లో చేరే రోగులు తగ్గారురాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు సర్కార్ అమలు చేసిన ట్రిపుల్ టీ(ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్) విధానం సత్ఫలితాలను ఇస్తుంది. దీంతోనే వైరస్‌ను అతి తక్కువ కాలంలో అదుపులోకి తేగలిగామని అధికారులు అంటున్నారు. వాస్తవంగా మార్చి నెలలో తొలి పాజిటివ్ కేసు నమోదైనప్పటీ నుంచి వైద్యశాఖ నిరంతరం శ్రమిస్తుంది. సిఎం ప్రోత్సాహం, మంత్రి అండదండలు హెల్త్ డైరెక్టర్ ప్లానింగ్‌తో కరోనా కట్టడికి వైద్యశాఖ నిద్రలేని రాత్రులు గడిపింది. ఉన్నతాధికారుల నుంచి వార్డు బాయ్ వరకు కమింట్ మెంట్‌తో పనిచేసి వైరస్‌ను 80 శాతం కట్టడి చేయగలిగారు. కొందరు అవాస్తవాలతో విమర్శలు చేసినా వైద్యశాఖ మనోధైర్యంతో కట్టడిని కొనసాగిస్తుంది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ కంట్రోల్‌లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జూన్, సెప్టెంబరు నెలలతో పోల్చుకుంటే వైరస్ తీవ్రత 60 శాతం తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఆర్.నాట్ విలువ 1కి పడిపోయినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Home treatment tends to kay

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page