చౌడేపల్లె రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

0 9,932

చౌడేపల్లె ముచ్చట్లు:

 

చౌడేపల్లె – బోయకొండ మార్గంలోని మల్లువారిపల్లె బస్టాప్‌ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంగలపల్లె పంచాయతీ మల్లువారిపల్లెకు చెందిన చిన్ననరసింహులు(40) , నరేష్‌ లు కలసి ద్విచక్రవాహనంపై పెద్దూరు సమీపంలోని గజ్జలవారిపల్లెలో ప్రభుత్వ రేషన్‌షాపు కోసం బియ్యం తీసుకునేందుకు వెళ్తున్నారు. ఇదే మార్గంలో మదనపల్లె నుంచి చౌడేపల్లె వైపుగా వెళ్తున్న టాటాఏసి వాహనం ద్విచక్రవాహాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో చిన్ననరసింహులు అక్కడిక్కడే మృతి చెందగా, నరేష్‌కు తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన బాధితున్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రవికుమార్‌ చేరుకుని మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Man killed in Choudepalle road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page