తిన్నదరగక తిట్టుకుంటున్నారు

0 9,261

కరీంనగర్  ముచ్చట్లు:

 

జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అబ్యర్ది బల్మూరి వెంకట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సినీయర్ నేత వి.హన్మంతారావు పాల్గోన్నారు. హన్మంతరావు మాట్లాడుతూ ఎలక్షన్ లు ఎందుకు వచ్చినయో మీకు తెలుసా తిన్నదరగక కేసీఆర్ ఈటల రాజేందర్ ఒకరిపై ఒక్కరు తిట్టుకుంటున్నారు. తెల్లారి పేపర్ చూస్తే వాళ్లే బోమ్మలే కనిపిస్తున్నాయి.  ఒక పక్క ఈటల మరోపక్క కేసీఆర్, హరీష్ రావు.  మహిళలు  బతుకమ్మ ఆడుతుంటే స్పీడ్ గా వచ్చి బతుకమ్మలను తొక్కుకుంటు ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు పోయింది. నల్ల చట్టాలను తెచ్చి రైతుల మెడకు ఉరితాడు వేసిండు నరేంద్రమోడీ. నల్ల చట్టాలను రద్దు చేయాలని ధర్నా చేస్తున్న రైతుల పైకి కారు ఎక్కించి రైతుల  ప్రాణాల ను పొట్టన పెట్టుకున్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఆసరా పెన్షన్,డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికి ఇవ్వలేదు కేసీఆర్. దళితులకు పది లక్షల రూపాయలు ఇవ్వమని ఎవ్వరు అడగలేదు ఎన్నికల కోసమే ఇస్తున్నాడు. దళిత బంధు లాగానే మిగితా కులాలకు కూడా పది లక్షలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియాగాంధీ కాలు కడిగి నెత్తిన పోసుకుంటానన్నాడు కేసీఆర్. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ. పెద్ద నోట్లను రద్దు చేసి నల్ల దనాన్ని పేదల ఖాతాలో వేస్తానన్న మోడీ  మాటా తప్పాడు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తానన్న మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్లను లేకుండా చేస్తున్నది బిజెపి ప్రభుత్వం.  కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు భూమి ఇచ్చింది ఇందిరమ్మ ఇళ్ల ని ఇచ్చింది మరి టీఆరెస్ ఏమి ఇచ్చింది. చదువుకున్న యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ ను ఆశీర్వదించి గెలిపించండని అన్నారు.

- Advertisement -

ముఖ్య‌మంత్రి ప్రారంభోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఈవో

Tags: Swearing inedible

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page