ఏవోబీ లో ఎదురు కాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

0 7,762

విశాఖపట్నం  ముచ్చట్లు:

ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతం ఏవోబీలో ఎదరు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.  ఈ మేరకు ఒడిషా రాష్ట్ర డీజీపీ బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ నెల పదవ తారిఖుల మావోయిస్టుల సంచారం చేస్తున్న సమాచారం పోలీసులకు అందింది. దాంతో స్పెషన్ ఆపరేషన్స్ గ్రూప్, డీవీఎఫ్, ఒడిషా పోలీసులు, సరిహద్దు భద్రతా ధళాలు సంయుక్తంగా గాలింపులు ప్రారంభించాయి. మంగళవారం నాడు పోలీసులకు  మావోయిస్టులు తారసపడగానే ఎదురు కాల్పులు జరిగాయి. తరువాత ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పట్టారు. బుధవారం ఉదయం మూడు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మల్కన్ గిరి జిల్లా సుధకొండకు చెందిన అనిల్ (అనిల్ కిషోర్, ముక సోడి పేర్లతో సెక్రటరిగా పనిచేస్తున్నాడు. అతడి తలపై ఐదులక్షల రివార్డు వుంది. మరో మృతురాలు సోనిగా గుర్తించారు. ఆమె తలపై నాలుగు లక్షల రివార్డు వుంది. మూడవ మృతదేహం చిన్నారావుది గా గుర్తించారు. చిన్నారావు తలపై లక్ష రూపాయల రివార్డు వుంది.  ఘటనస్థలంనుంచి భారీ ఎత్తునల అయుధాలు, సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Counter fire in Awobi .. Three Maoists killed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page