దసరా పూర్తయింది…తిరిగి వచ్చేదెలా

0 7,759

రంగారెడ్డిముచ్చట్లు:

పండగ ఏదైనా ప్రజలకు నరకం కనిపిస్తుంది. తప్పనిసరిగా తమ ప్రాంతాలకు చేరుకోవడానికి సెలవులు వస్తే అంతా బయల్దేరుతారు. సొమ్ములు వున్నవారికి సొంత వాహనాలు ఎలాగూ ఉంటాయి. పేద, మధ్యతరగతి వర్గాల వారికి ప్రభుత్వ రవాణా సంస్థలే ఆధారం. అయితే కేంద్రం ప్రభుత్వ పర్యవేక్షణ లోని రైల్వే ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో వుండే రోడ్డు రవాణా సంస్థల వరకు అంతా పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక వచ్చే ముందు నుంచి డబుల్, ట్రిబుల్ చార్జీలతో స్పెషల్స్ పేరుతో నిలువు దోపిడీ మొదలైపోతుంది.వాస్తవానికి ప్రయివేట్ రవాణా సంస్థలు మాత్రమే కొంత కాలం కిందటి వరకు అధిక చార్జీలను వసూలు చేసేవి. కానీ ఈ బాటలోనే ప్రభుత్వ రంగ సంస్థలు దిగిపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. డబ్బున్నవారికి చార్జీల మోత ఎలావున్నా భరించగలరు అదే కూలి నాలి చేసుకునే వారు భాగ్యనగరం నుంచి అమరావతి నుంచి తమ సొంత గూటికి కుటుంబంతో చేరుకోవాలంటే నెలరోజులపాటు సంపాదించుకున్న సొమ్ము రవాణా ఛార్జీలకు చెల్లించుకోవాలిసి వస్తుంది.పేరుకే పండగ తప్ప తమ జేబులకు చిల్లులే అని ప్రయాణికుల వేదన మాత్రం ప్రభువులకు వినపడటం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్వే కూడా అలానే తయారయింది. ఇక తెలంగాణాలోఆర్టీసీ సమ్మె జరుగుతుండటంతో పండగకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు వేల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తుంది. ప్రయివేటు బస్సుల యాజమాన్యం దోపిడీకి దిగింది. అలాగే అధికారులకు అయితే ప్రయాణికుల వేదన కనిపించడం కూడా లేదంటే ఈ దోపిడీ ప్రతి పండగకు పెరుగుతూనే పోతుందన్నది స్పష్టం అవుతుంది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Dussehra is over … how to come back

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page