సైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వనిత

0 7,582

చాగల్లు ముచ్చట్లు:

దేశ రక్షణ కి సైనికులు తమ ప్రాణాలు కోల్పోతుంటే , ఇక్కడ కొందరు స్వార్ధ పరులు కులాలు, మతాలు పేరిట విద్వేషాలు రెచ్చకొడుతున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు.  బుధవారం ఉదయం మార్కొండపాడు లోని రజనీకుమార్ ఇంటి వద్ద ఆయన భౌతిక కాయానికి పూల మాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన జవాన్ మల్లిపూడి రజనీకుమార్ లడక్ లో విధి నిర్వహణలో గుండెపోటు తో మృతి చెందడం దురదృష్టకరమన్నారు.  దేశ భద్రత కోసం శరీరం గడ్డకట్టే చలిలో దేశ సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు.  మల్లిపూడి రజనీకుమార్ భార్య జ్యోతి , కుటుంబ సభ్యులని మంత్రి ఓదార్చి మనోధైర్యం ఇచ్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.    మార్కొండపాడు గ్రామంలో బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కార కార్యక్రమాలు  నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Minister Vanitha visiting the soldier’s family

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page