పాకిస్తాన్ దెబ్బకు దెబ్బ తీయాలి

0 867

లాహోర్ ముచ్చట్లు:

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ఐదుగురు జవాన్లు బలిదానాలకు ప్రతీకారం తీర్చుకోవాలని శివసేన పేర్కొంది. ఉగ్రవాదులపై ప్రతీకారం అంతకు ఐదు రెట్లు ఎక్కువ ఉండాలని అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో డిమాండ్ చేసింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని పలు నిబంధనలను రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ సానుభూతిపరులకు ధైర్యం వచ్చిందని వ్యాఖ్యానించింది. కశ్మీర్‌లోకి వివిధ మతాలకు చెందిన వ్యక్తులు ప్రవేశించలేని వాతావరణాన్ని సృష్టించడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని మండిపడింది.ఇటీవల కొన్ని వారాలుగా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వారం వ్యవధిలోనే ప్రముఖ కశ్మీరీ పండిట్, ఫార్మా వ్యాపారి బింద్రూ సహా స్కూల్ టీచర్లను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ హత్యలను ప్రస్తావిస్తూ.. 1990లలో వేలాది మంది కశ్మీరీ పండితులు లోయను విడిచి వెళ్లాల్సిన వచ్చినప్పుడు పరిస్థితిలాగే మారుతోందా అని ఇటువంటి హింసాత్మక సంఘటనలు అనుభూతిని ఇస్తాయని శివసేన పేర్కొంది.ఐదుగురు సైనికులను చంపిన ఉగ్రవాదులను హతమార్చే వరకు భారతీయుల మనశ్శాంతి లభించదు’ అని తన సంపాదకీయంలో పేర్కొంది. ‘సూరంకోట్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఐదుగురు సైనికుల రక్తం ఆరిపోక ముందే ఉగ్రవాదులను చంపి ఐదుసార్లు ప్రతీకారం తీర్చుకోవాలి’ అని సంపాదకీయంలో డిమాండ్ చేసింది.రాజౌరీ సెక్టార్‌లో సోమవారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. మూడు వేర్వేరు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పూంఛ్ జిల్లా సురాన్‌కొటే ప్రాంతంలోని డేరా కి గాలీ (డీకేజీ) సమీపం గ్రామంలో ఉగ్రవాదులు చొరబడినట్టు సమాచారం అందుకున్న భద్రత బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. అక్కడ సోదాలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.ముష్కరుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఐదుగురు సైనికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై యావత్తు దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసింది. ఉగ్రవాదులపై ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతున్నారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా శివసేన, డోగ్రా ఫ్రంట్ సోమవారం నిరసన చేపట్టి.. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిష్టిబొమ్మను దగ్దం చేశాయి.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Pakistan must be dealt a blow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page