వరంగల్ లో గులాబీ గర్జన

0 7,881

వరంగల్ ముచ్చట్లు:

లాబీ ప్లీనరీకి డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ నెల 25న 14 వేల మంది ప్రతినిధులతో ప్లీనరీ జరగబోతోంది. అదే రోజు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. మరోవైపు పార్టీ ఏర్పడి 20 ఏళ్లు పూర్తవడం, ప్రభుత్వం వచ్చి ఏడేళ్ల అయిన సందర్భంగా తెలంగాణ విజయ గర్జన పేరుతో వచ్చే నెల 15వ తేదీన వరంగల్‌లో భారీ సభకు ప్లాన్‌ చేసింది టీఆర్‌ఎస్‌. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ.. స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచింద‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ త‌ర్వాత అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాల‌ని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ గ్రామ, వార్డు, మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు హాజరు కావాల‌న్నారు.లక్షలాదిగా తరలిరావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27న‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఈ సన్నాహక సమావేశాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజు నిర్వహించనున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Pink roar in Warangal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page