ఆగిన విద్యుత్ సరఫరా..సిబ్బందిపై గ్రామస్థుల దాడి

0 7,581

కామారెడ్డి ముచ్చట్లు:

గత మూడు రోజులుగా గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సబ్ స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బంది పై గ్రామస్తులు దాడి చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామం లో చోటు చేసుకుంది. గాయపడిన సిబ్బంది అనిల్, గంగారాం, బ్రహ్మం, దేవి సింగ్ లు గా గుర్తించారు. దీంతో ట్రాన్స్కో సిబ్బంది దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పై గ్రామస్తులు దాడి చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముత్యంపేట గ్రామం లోని సబ్ స్టేషన్ లో రెండు ట్రాన్స్ఫార్మర్లు తొలగించారు. దీంతో వారం రోజులుగా ముత్యంపేట్ గ్రామానికి దోమకొండ నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తున్నారని తెలుసుకుని గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. దేవీనవరాత్రుల సమయంలో విద్యుత్ సరిగా సరఫరా చేయడం లేదని మాట్లాడుతుండగా విద్యుత్ సిబ్బంది సెల్ఫోన్లో వీడియో తీశారు. దీంతో ఎందుకు వీడియో తీస్తున్నారని గ్రామానికి చెందిన యువకులు అడ్డుకునే ప్రయత్నంలో సిబ్బందికి గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా విద్యుత్ అధికారులకు తెలియజేసినట్లు సర్పంచ్ వెల్లడించారు. గ్రామ యువకులు విద్యుత్ సిబ్బందిపై దాడి చేశారని విద్యుత్ అధికారులు గ్రామానికి విద్యుత్ ను  నిలిపివేశారు. దీంతో ముత్యంపేట గ్రామ మంగళవారం రాత్రి వరకు అంధకారంలోనే ఉండిపోయింది.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Power outage..Villagers attack staff

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page